దట్ ఈజ్ రోహిత్ శర్మ.. టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్
ABN, First Publish Date - 2023-07-19T15:11:15+05:30
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బ్యాటర్‌గా టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో నిలిచాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటింగ్ రాంకింగ్స్, టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బ్యాటర్‌గా టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో నిలిచాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటింగ్ రాంకింగ్స్, టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న రోహిత్ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెస్టిండీస్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక భారత బ్యాటర్ రోహిత్ శర్మనే కావడం గమనార్హం. అలాగే వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ 10వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ స్థానంలో 707 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 5వ స్థానంలో, విరాట్ కోహ్లీ 8వ స్థానంలో ఉన్నాడు. గిల్ ఖాతాలో 738 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. కోహ్లీ ఖాతాలో 719 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
డబ్ల్యూటీస్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. వెస్టిండీస్ పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటాడు. సెంచరీ కొట్టి తన ఫామ్‌పై ఉన్న సందేహాలను కూడా తొలగించాయి. దీంతో ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. అదే ఊపులో గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అలాగే రోహిత్ శర్మ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు మంచి పరిమాణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
Updated Date - 2023-07-19T15:12:44+05:30 IST