HCA: హైదరాబాద్‌లో వరుస మ్యాచ్‌లంటే కష్టమే!
ABN, First Publish Date - 2023-08-21T04:10:03+05:30
వన్డే వరల్డ్‌క్‌ప(ODI World Cup)లో భాగంగా హైదరాబాద్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల నిర్వహణకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలపై హెచ్‌సీఏ(HCA) ఆందోళన చెందుతోంది.
వరల్డ్ కప్ భద్రతా ఏర్పాట్లపై హెచ్‌సీఏ ఆందోళన
షెడ్యూల్ మార్పు సాధ్యం కాదన్న బీసీసీఐ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వన్డే వరల్డ్‌క్‌ప(ODI World Cup)లో భాగంగా హైదరాబాద్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల నిర్వహణకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలపై హెచ్‌సీఏ(HCA) ఆందోళన చెందుతోంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో వచ్చే అక్టోబరు 9న న్యూజిలాండ్‌తో నెదర్లాండ్స్, 10న పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌లు(Sri Lanka vs Pakistan Matches) ఆడాలి. అంతకంటే ముందు అక్టోబరు 6న నెదర్లాండ్స్, పాకిస్థాన్(Netherlands vs Pakistan Matches) మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే, ఒక్కరోజు కూడా విరామం లేకుండా చివరి రెండు మ్యాచ్‌లను వెంటవెంటనే నిర్వహిస్తుండడంతో, తగినంత బందోబస్తు కల్పించలేమని హైదరాబాద్ పోలీసు యంత్రాంగం హెచ్‌సీఏ(HCA)కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వారం క్రితమే బీసీసీఐ(BCCI) దృష్టికి హెచ్‌సీఏ తీసుకెళ్లింది. ఇప్పటికే సవరించిన షెడ్యూల్‌లో అహ్మదాబాద్(Ahmedabad)లో భారత్-పాక్ మధ్య జరగాల్సిన లీగ్ పోరు సహా 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం నాలుగు జట్ల (పాకిస్థాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, న్యూజిలాండ్)కు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీసు స్లాట్లను ఎలా కేటాయించాలనేది హెచ్‌సీఏకు తలనొప్పిగా మారింది. అయితే.. షెడ్యూల్‌ను మార్చడం ఒక్క బీసీసీఐ చేతిలోనే లేదని, ఐసీసీతో పాటు సభ్య దేశాల అనుమతి కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలో మార్పులకు ఆస్కారం లేదని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వరల్డ్‌క్‌పలో హైదరాబాద్ వేదికకు తానే ఇన్‌చార్జ్ కావడంతో, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
Updated Date - 2023-08-21T05:14:11+05:30 IST