Team India schedule: ఐపీఎల్ తర్వాత టీమిండియా ఫుల్ బిజీ.. ఆటగాళ్లకు విశ్రాంతిలేని షెడ్యూల్.. మ్యాచ్‌లు ఆడేది ఈ దేశాలపైనే..
ABN, First Publish Date - 2023-05-26T16:29:08+05:30
ఐపీఎల్ తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి తగినంత మజా దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమిండియా క్రికెట్ షెడ్యూల్ చాలా బీజీగా ఉంది.
ముంబై: ఐపీఎల్2023 (IPL2023) సీజన్ ఈ ఆదివారంతో ముగిసిపోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోగా... ఇక శుక్రవారం ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి తగినంత క్రికెట్ మజా దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమిండియా క్రికెట్ షెడ్యూల్ చాలా బీజీగా ఉంది.
ప్రస్తుతానికి టీమిండియాకి చెందిన ఆటగాళ్లులో ఎక్కువ మంది ఐపీఎల్‌లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీమిండియా ఈ ఏడాది మార్చి 22 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆ తర్వాత 9 రోజుల వ్యవధిలోనే ఐపీఎల్ మొదలైంది. దాదాపు 2 నెలలపాటు అవిశ్రాంతంగా ఐపీఎల్‌లో ఆడినప్పటికీ విశ్రాంతి లేకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమయ్యారు. జూన్ 7న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ, శార్ధూల్ థాకూర్, ఉమేష్ యాదవ్‌లతో కూడిన మొదటి బ్యాచ్ ట్రైనింగ్ సెషన్ కోసం ఇప్పటికే యూకే చేరుకుంది. ఇక మిగతా ఆటగాళ్లు మే 29 లేదా 30న బయలుదేరనున్నారు.
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే...
డబ్ల్యూటీసీ ఫైనల్ వర్సెస్ ఆస్ట్రేలియా - జూన్ 7-11 వరకు (వేదిక ఇంగ్లాండ్)
3 వన్డే మ్యాచ్‌లు వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ - జూన్/జులై.
3 వన్డేలు, 2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌లు వర్సెస్ వెస్టిండీస్ (జులై నుంచి ఆగస్ట్ వరకు)
3 టీ20 మ్యాచ్‌లు వర్సెస్ ఐర్లాండ్ - (ఐర్లాండ్).
వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ - సెప్టెంబర్
3 వన్డేలు వర్సెస్ ఆస్ట్రేలియా (స్వదేశం) - సెప్టెంబర్
వన్డే వరల్డ్ కప్ (ఇండియా) - అక్టోబర్ నుంచి నవంబర్
5 టీ20 వర్సెస్ ఆస్ట్రేలియా (స్వదేశం)- నవంబర్ నుంచి డిసెంబర్.
2 టెస్టులు వర్సెస్ దక్షిణాఫ్రికా -డిసెంబర్.
కాగా ఈ షెడ్యూల్ ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది.
Updated Date - 2023-05-26T16:38:40+05:30 IST