ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్! నేపాల్‌తో మ్యాచ్‌‌కు స్టార్ పేసర్ దూరం

ABN, First Publish Date - 2023-09-03T21:15:43+05:30

ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరంగా కానున్నాడని సమాచారం.

ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరంగా కానున్నాడని సమాచారం. శ్రీలంకలో టీమిండియా క్యాంపులో ఉన్నబుమ్రా వ్యక్తి గత కారణాల దృష్యా అట్టహాసంగా ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జట్టు మేనేజ్‌మెంట్ కానీ, బీసీసీఐ కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ ఈ వార్తలను ధృవికరిస్తున్నాయి. జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు. కాకపోతే వ్యక్తిగత కారణాలతో అతను ముంబై వచ్చాడు. దీంతో సోమవారం నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఈ పేస్ గన్ దూరం కానున్నాడు. బుమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తుది జట్టులోకి రానున్నాడు. అయితే టీమిండియా సూపర్ 4కు చేరుకుంటే అప్పటికీ బుమ్రా మళ్లీ జట్టులో చేరనున్నాడు. కాగా ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా దాదాపు సంవత్సరం పాటు జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుని ఐర్లాండ్ పర్యటనతో ఎంట్రీ ఇచ్చిన ఈ పేస్ గన్ మొదటి సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు.

Updated Date - 2023-09-03T21:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising