ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Andhra Pradesh: విషాదం.. స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన వీరాభిమాని మృతి

ABN, First Publish Date - 2023-08-31T21:14:58+05:30

విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన క్రికెట్ వీరాభిమాని ఈశ్వర్ గురువారం నాడు గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా అతడు ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్‌గా పనిచేస్తున్నాడు.

తెలుగు క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన క్రికెట్ వీరాభిమాని ఈశ్వర్ గురువారం నాడు గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా అతడు ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సేవలు అందిస్తున్నాడు. క్రికెట్ అంటే ప్రాణంగా భావించే ఈశ్వర్ క్రికెటర్‌గా రాణించాలని ఆకాంక్షించాడు. అయితే పరిస్థితుల దృష్ట్యా సైడ్ ఆర్మ్ త్రో బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్‌గా పనిచేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Jio Cinema: స్టార్ గ్రూప్‌కు జియో సినిమా షాక్.. ఇకపై ప్రసార హక్కులు జియోవే..!!

కాగా క్రికెట్ వీరాభిమాని ఈశ్వర్‌కు టీమిండియా మాజీ ఆటగాడు వేణుగోపాలరావు ప్రోత్సాహంతో స్టార్ క్రికెటర్లతో మంచి అనుబంధం ఏర్పడింది. పేద కుటుంబంలో జన్మించినా క్రికెట్ అంటే ఎంతో ప్రేమించేవాడు. కానీ ఒక్కసారిగా గురువారం గుండెపోటుతో మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈశ్వర్ మరణించిన విషయం తెలుసుకున్న టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ విశాఖ గాజువాకలోని ఈశ్వర్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించాడు. మరోవైపు ఈశ్వర్ మృతి పట్ల పలువురు స్టార్ స్టార్ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ పాంటింగ్, ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, పలువురు క్రికెటర్లు ఈశ్వర్ మృతికి సంతాపం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కూడా ఈశ్వర్ మృతి పట్ల సానుభూతి ప్రకటించింది.

Updated Date - 2023-08-31T21:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising