ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI 1st Test: బ్యాడ్ న్యూస్.. మొదటి రోజు ఆటకు వర్షం ఆటంకం?

ABN, First Publish Date - 2023-07-12T13:29:28+05:30

భారత్, వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మొదటి రోజు నిరాశే మిగిలే అవకాశాలున్నాయి. స్థానిక వాతావరణ నివేదికల ప్రకారం మ్యాచ్ జరగనున్న డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో బుధవారం వర్షం పడే అవకాశాలున్నాయి. మొదటి రోజు ఆటలో మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొమినికా: భారత్, వెస్టిండీస్ మొదటి టెస్ట్ (India vs West Indies First Test) మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మొదటి రోజు నిరాశే మిగిలే అవకాశాలున్నాయి. స్థానిక వాతావరణ నివేదికల ప్రకారం మ్యాచ్ జరగనున్న డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో (Windsor Park, Dominica) బుధవారం వర్షం పడే (chances of rain) అవకాశాలున్నాయి. మొదటి రోజు ఆటలో మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. రోజంతా వాతావరణం 59 శాతం మేఘావృతమై ఉంటుంది.


అయితే ఈ వర్షం రోజంతా ఉండకపోవచ్చు. దీంతో మొదటి రోజు మొత్తం కాకపోయినా కొంత మేరకు జరిగే అవకాశాలున్నాయి. విండ్సర్ పార్క్‌లో ఉష్ణోగ్రతలు ఇవాళ 25-31 డిగ్రీల సెల్సియస్ మధ్యనే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా మొదటి రోజు గాలులు ఉండడం పేస్ బౌలర్లకు కలిసి రానుంది. ఇది పిచ్‌పై పేసర్లు అదనపు స్వింగ్ రాబట్టడానికి దోహదపడుతుంది. అయితే మిగతా 4 రోజులు మాత్రం వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కాకపోతే రెండవ రోజు, మూడవ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కానీ వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 4వ రోజు, 5వ రోజు వాతావరణం వేడిగా ఉండనుంది. కాబట్టి వర్షం వచ్చే అవకాశాలు లేవు.

ఇక మ్యాచ్ జరగనున్న విండ్సర్ పార్క్ పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. మ్యాచ్ ఫలితంపై టాస్ ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మొదటి రోజు పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టవచ్చు. రెండు, మూడు రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. ఇక నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు.

Updated Date - 2023-07-12T13:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising