ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tilak Verma: మన కుర్రాడు పోటీలోకొచ్చాడు

ABN, First Publish Date - 2023-08-15T01:58:44+05:30

అరంగేట్రం సిరీ్‌సలోనే 20 ఏళ్ల తిలక్‌ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్‌ మిడిలార్డర్‌లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు.

జట్టులోని బలహీనతలకు సమాధానాలు వెతకడమే లక్ష్యంగా వెస్టిండీస్‌(West Indies) పరిమిత ఓవర్ల సిరీస్‌ పర్యటనకు భారత్‌(India) వెళ్లింది. అందుకు తగ్గట్టుగానే ప్రయోగాలు చేసినా.. టీ20 సిరీ్‌స(T20 series)లో అరంగేట్రం చేసిన తెలుగు తేజం తిలక్‌ వర్మ(Tilak Verma) మినహా ఆశించిన స్థాయి ఫలితాలనైతే రాబట్టలేదు. తన దూకుడైన బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వర్మ.. వరల్డ్‌కప్‌ జట్టు మిడిలార్డర్‌లో గట్టి పోటీదారుగా మారాడు. అయితే, నెం:4 స్థానానికి మాత్రం తగిన ఆటగాడు వెలుగు చూడలేదు. త్వరలో ఆసియాకప్‌, వన్డే వరల్డ్‌కప్‌(ODI World Cup) ముందు ప్రయోగాలు చేసేందుకు విండీ్‌సతో వన్డే సిరీస్‌ ఒక్కటే చివరి అవకాశం. దీంతో సీనియర్లు రోహిత్‌, కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. కానీ, రెండో వన్డేలో టీమిండియా ఓటమితో విమర్శలు వచ్చాయి. ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు తమ సత్తా చాటేందుకు సువర్ణావకాశం లభించింది.

కరీబియన్లతో సిరీస్‌ ఆరంభానికి ముందు సంజూ, కిషన్‌లు వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పోటీలో ఉన్నా ముగిసేసరికి కిషన్‌ రిజర్వు ఓపెనర్‌గా ఎదిగాడు. రోహిత్‌ గైర్హాజరీలో కిషన్‌ 52, 55, 77 పరుగులతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. మరోవైపు మూడో వన్డేలో అర్ధ శతకంతో శాంసన్‌ తన ప్రతిభను చాటుకొన్నాడు. టీ20 సిరీస్‌లో కూడా సంజూ అదరగొడతాడని భావించినా.. నిరాశపర్చాడు. ఈనేపథ్యంలో వరల్డ్‌కప్‌ సంగతేమో కానీ ఆసియాకప్‌ వరకైతే అతడిని జట్టు భరించే అవకాశం ఉంది. ఇక, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ గాయాలతో దూరం కావడంతో మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌పై భారీగా అంచనాలు పెట్టుకొన్నా.. అతడు ఆశించిన రీతిలో మెరవలేక పోయాడు. కానీ, మెగా కప్‌ కోసం అతడిని పక్కనపెట్టడం కష్టమే..! ఈ నెల 30న ఆసియాకప్‌ ఆరంభమయ్యే సమయానికి రాహుల్‌, అయ్యర్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకొన్నా వారి ఇద్దరిఫామ్‌పై టీమ్‌ సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది. ఇక, నెం:4 స్థానం కోసం వెతుకుతూనే ఉన్నామని కెప్టెన్‌ రోహిత్‌ స్వయంగా అంగీకరించాడు.


డార్క్‌హార్స్‌..

అరంగేట్రం సిరీస్‌లోనే 20 ఏళ్ల తిలక్‌ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్‌ మిడిలార్డర్‌లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు. అల్జరీ జోసెఫ్‌ బౌలింగ్‌లో వరుస సిక్స్‌లతో అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఎంట్రీని ఘనంగా చాటాడు. టీమ్‌లోని మిగతా ఆటగాళ్లు విఫలమైన చోటే పరుగులు సాధించి చూపించాడు. దీంతో ఎంతో ప్రత్యేక ప్రతిభ కలిగిన వర్మను వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయాలని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. మాజీ ఆటగాళ్లు కూడా అందుకు మద్దతు తెలపడంతో వర్మ జాక్‌పాట్‌ కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చైనామెన్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో తన చోటును సుస్థిరం చేసుకోవడం శుభపరిణామం. విండీస్‌ టూర్‌లో మిడిల్‌ ఓవర్లలో కుల్దీప్‌ సూపర్‌గా రాణించి ఏడు వికెట్లు పడగొట్టాడు. సహచరుడు చాహల్‌ను వెనక్కునెట్టి వరల్డ్‌కప్‌ జట్టులో చోటుకు గట్టిపోటీదారుగా మారాడు. తన పేస్‌తో వెలుగులోకి వచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంకా నేర్చుకోవాలనే విషయం ఈ సిరీ్‌సతో తేలిపోయింది. బౌలింగ్‌లో వేగమేకాదు.. బ్యాటర్లను బోల్తా కొట్టించే ట్రిక్కులు కూడా ఉండాలని దిగ్గజం బ్రియాన్‌ లారా సూచనలను మాలిక్‌ ఏమేరకు అనుసరిస్తాడనేది భవిష్యత్తులో తేలనుంది.

Updated Date - 2023-08-15T10:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising