ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: మరో 79 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2023-08-31T21:52:11+05:30

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు. దీంతో మూడో స్థానంలో మరో 79 పరుగులు చేస్తే 14 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో 14 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లోనే అందుకోవడం ఖాయమనే చెప్పుకోవాలి. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లోనే కోహ్లీ ఈ రికార్డును అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తన కెరీర్‌లో ఇప్పటివరకు 111 టెస్టులు, 275 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 8,676.. వన్డేల్లో 12,898.. టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 76 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు చేశాడు. కాగా కోహ్లీ తన కెరీర్‌లో వన్డే, టీ20ల్లో 90 శాతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

Updated Date - 2023-08-31T21:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising