ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: ఆటలోనే కాదు సంపాదనలోనూ కింగే.. విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-06-18T17:24:33+05:30

కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని స్టాక్ గ్రో (Stock Gro) అనే సంస్థ వెల్లడించింది. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 1,050 కోట్లు. ప్రస్తుతం కెరియర్‌ను కొనసాగిస్తున్న క్రికెటర్లలో అత్యధిక ఆదాయం ఉన్నది విరాట్ కోహ్లీకే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ముందుంటాడు. కింగ్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఏకంగా 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో (Social media) అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల్లో పరుగుల యంత్రం కోహ్లీ ముందున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు. సంపాదనలోనూ కింగే. కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని స్టాక్ గ్రో (Stock Gro) అనే సంస్థ వెల్లడించింది. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 1,050 కోట్లు. ప్రస్తుతం కెరియర్‌ను కొనసాగిస్తున్న క్రికెటర్లలో అత్యధిక ఆదాయం ఉన్నది విరాట్ కోహ్లీకే.

34 ఏళ్ల కోహ్లీ చాలా కాలంగా భారత (Team india) జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో కోహ్లీకి బీసీసీఐ (BCCI) A+ కాంట్రాక్టు ఇచ్చింది. కాగా A+ కాంట్రాక్టు ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఐ సంవత్సరానికి రూ. 7 కోట్లను చెల్లిస్తుంది. ఇది కోహ్లీకి మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌ రూ.3 లక్షలు అందుతాయి. ఇవే కాకుడా ఈ మాజీ టీమిండియా కెప్టెన్‌ ఐపీఎల్ (IPL) ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (Indian Premier League) ప్రస్తుతం కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఫ్రాంచైజీ ఏడాది రూ.15 కోట్లు చెల్లిస్తుంది.

ఇవే కాకుండా కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్ (MPL), స్పోర్ట్స్ కాన్వో వంటి ఏడు స్టార్టప్‌లలో కోహ్లీకి పెట్టుబడులు పెట్టాడు. అలాగే 18 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కూడా ఉన్నాడు. ఒక్కో ప్రకటనకు ఏడాదికి రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటాడు. ఇది ఇతర క్రీడాకారులతోపాటు బాలీవుడ్ స్టార్స్ అందుకునే దానికన్న ఎక్కువే. ఇలా ప్రకటనల ద్వారానే రూ.175 కోట్లు అందుకుంటున్నాడు. తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకోని సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా ఢబ్బులను జేబులో వేసుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ పెట్టడానికి రూ. 8.9 కోట్లు, ట్విట్టర్‌లో (Twitter) ఒక ట్వీట్ చేయడానికి రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు.

ఇవే కాకుండా విరాట్‌కు భారీ విలువ చేసే రెండు ఇళ్లు కూడా ఉన్నాయి. గురుగ్రామ్‌లో రూ.80 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు, ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే మరో విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే 31 కోట్లు విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇండియన్ సూపర్ లీగ్‌లో (Indian Super League) ఎఫ్‌సీ గోవా క్లబ్ జట్టు, ఓ టెన్నిస్ టీమ్, ఓ ప్రొ రెజ్లింగ్ టీం కూడా ఉన్నాయి.

స్టాక్ గ్రో వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇవి కింగ్ కోహ్లీ ఆస్తుల వివరాలు. దీనిని బట్టి కోహ్లీ బాగానే వెనకేశాడని చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేకపోవడంతో సెలవులను ఎంజాయ్ చేస్తున్న విరాట్.. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనలో పాల్గొనే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-06-18T17:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising