ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI 2nd Test: టాస్ గెలిచిన వెస్టిండీస్.. మరో భారత ఆటగాడు అరంగేట్రం

ABN, First Publish Date - 2023-07-20T19:25:06+05:30

భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు వెస్టిండీస్ టాస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్ యూనిట్‌లో పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు.

ట్రినిడాడ్: భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు వెస్టిండీస్ టాస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్ యూనిట్‌లో పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేస్తున్నాడు. కాగా ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన మూడో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు. గత మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు అతిథ్య వెస్టిండీస్ జట్టు రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. పేస్ బౌలర్ షానన్ గాబ్రియేల్, బ్యాటర్ కిర్క్ మెకెంజీను తుది జట్టులోకి తీసుకున్నారు. కిర్క్ మెకెంజీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేస్తున్నాడు. కాగా భారత్, వెస్టిండీస్ మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఇది 500వ మ్యాచ్ కావడం విశేషం. ఇక రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.


వెస్టిండీస్ తుది జట్టు:

క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్

భారత్ తుది జట్టు:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-07-20T20:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising