Anushka Virat Kohli:అనుష్కతో ప్రేమలో పడ్డాక నా జీవితమే మారింది: విరాట్ కోహ్లీ
ABN, First Publish Date - 2023-03-11T09:55:48+05:30
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జీవితంలో జరిగిన మార్పుల గురించి తాజాగా ఆర్సీబీ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో...
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జీవితంలో జరిగిన మార్పుల గురించి తాజాగా ఆర్సీబీ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో వెల్లడించారు.(Virat Kohli) తాను అనుష్కాశర్మను(Anushka) కలవడం, ఆపై ఆమెతో ప్రేమలో పడి డేటింగ్ చేయడం తన జీవితాన్ని మార్చేసిందని కోహ్లీ చెప్పారు. స్టార్ క్రికెటర్ అయిన కోహ్లీ తన ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పోడ్‌కాస్ట్ (Rcb podcast) ఎపిసోడ్‌లో పలు విషయాలను మొహమాటం లేకుండా చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్ ను ట్విట్టరులో పోస్టు చేసింది.
ఇది కూడా చదవండి : Lay off: ఫేస్‌బుక్ మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత
అనుష్క శర్మ కలిశాక తన జీవితంలో మార్పులు వచ్చాయని(Life Changing Moment), సలహాలు స్వీకరించడం అలవర్చుకున్నానని కోహ్లీ అంగీకరించారు. ‘‘మా నాన్న మరణం తర్వాత తాను బలంగా తయారయ్యానని చెప్పారు. తన తండ్రి తనను గొప్ప క్రికెటరుగా చూడాలనుకున్నారని, అందుకే తాను క్రికెట్ పై మరింత దృష్టి సారించానన్నారు. అనుష్కాశర్మతో ప్రేమలో పడిన కోహ్లీ కొన్నాళ్లు డేటింగ్ చేశాక 2017లో వివాహం చేసుకున్నారు. వారికి వామిక అనే కుమార్తె ఉంది. అనుష్కను కలిసిన తర్వాత తాను జీవితాన్ని పూర్తిగా భిన్నమైన రీతిలో చూశానని కోహ్లీ చెప్పారు.
Updated Date - 2023-03-11T09:59:45+05:30 IST