ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp: ఇక నుంచి భయం అవసరం లేదు.. యూజర్ల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సాప్!

ABN, First Publish Date - 2023-08-29T20:43:24+05:30

ఇటీవల దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అమాయకులకు వల వేస్తున్న సైబర్ మోసాగాళ్లు వారిని నిండా ముంచుతున్నారు.

ఇటీవల దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అమాయకులకు వల వేస్తున్న సైబర్ మోసాగాళ్లు వారిని నిండా ముంచుతున్నారు. సైబర్ మోసాలకు అడ్డాగా మారుతున్న వాటిలో ప్రముఖ మిసేజింగ్ యాప్ వాట్సాప్‌ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా మోసపోయే అమాయకుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో వాట్సాప్ వాడాలంటనే పలువురు భయపడుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ మాతృసంస్థ మెటా అప్రమత్తమైంది. తమ యూజర్ల భద్రతపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే యూజర్ల భద్రత కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై పని చేస్తోంది. WABetaInfo లేటెస్ట్ డేటా ప్రకారం.. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ (Protect IP address in calls) అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై వాట్సాప్ యాజమాన్యం పని చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్ కాల్స్ సమయంలో యూజర్ల ఐపీ అడ్రస్(IP address), వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ వ్యక్తులకు కష్టతరం అవుతుంది. కాగా సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునే సమయంలో వినియోగదారుల లోకేషన్‌ను ట్రాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారి ఆటలను కట్టించేందుకే వాట్సాప్ ఈ కొత్త ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది.


"ఈ కొత్త ఫీచర్ కాల్స్ సమయంలో గోప్యతా రిలే ఫీచర్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది WhatsApp సర్వర్‌ల ద్వారా కాల్స్ మాట్లాడే వ్యక్తుల లోకేషన్‌ను గుర్తించడం కష్టతరం చేస్తుందని" అని WABetaInfo తన నివేదికలో పేర్కొంది. వినియోగదారుడు కాల్ చేసినప్పుడు, వారి ఫోన్ వాట్సాప్ సర్వర్లకు కనెక్ట్ అవుతుంది. వాట్సాప్ సర్వర్లు కాల్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి అవతలి వ్యక్తి ఫోన్‌కి రూట్ చేస్తాయి. అవతలి వ్యక్తి ఫోన్ కాల్‌ను డీక్రిప్ట్ చేసి, వినియోగదారుడికి కాల్ కనెక్ట్ చేస్తుంది. ఆ కాల్ వాట్సాప్ సర్వర్లకు కనెక్ట్ చేసినట్లు మాత్రమే ఇతరులు చూడగలుగుతారు. వినియోగదారుల ఐపీ అడ్రస్, లొకేషన్‌ను చూడలేరు. దీంతో వినియోగదారుల లొకేషన్‌ను ట్రాక్ చేయడం కష్టం. అయితే ఈ ఫీచర్ వినియోగదారులకు అదనపు భద్రతను అందించినప్పటికీ, కాల్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం టెస్టింగ్ సమయంలో ఉన్నందున అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. అయితే వాట్సాప్ యాప్ రాబోయే అప్‌డేట్‌లోనే ఈ నూతన ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే వాట్సాప్ ఇటీవల తన సెట్టింగ్‌లలో కొత్తగా "సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్" అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. మెటా తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో నూతన ఫీచర్లను ప్రకటిస్తూ "సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్"(Silence Unknown Callers) వాట్సాప్ వినియోగదారులకు మరింత గోప్యతను, ఇన్‌కమింగ్ కాల్స్‌పై నియంత్రణను ఉంచుతుందని వెల్లడించింది. మెరుగైన రక్షణ కోసం ఈ ఫీచర్ స్పామ్, స్కామ్‌లు, తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు స్క్రీన్‌పై చూపిస్తుంది. "ఈ ఫీచర్ ద్వారా మరింత గోప్యత, నియంత్రణ కోసం WhatsAppలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్‌లను ఆటోమేటిక్‌గా మ్యూట్ చేయవచ్చు." అని మెటా (Meta) వ్యవస్థాపకుడు, సీఈఓ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఒకసారి మ్యూట్ చేస్తే తెలియని నంబర్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను ఆటోమేటిక్‌గా మ్యూట్ చేస్తుంది. అయితే వినియోగదారులు ముఖ్యమైన కాల్స్‌ను కోల్పోకుండా ఉండేందుకు కాల్ లిస్ట్ ట్యాబ్‌లో, నోటిఫికేషన్‌లలో హిస్టరీ ఉంటుంది.

Updated Date - 2023-08-29T22:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising