ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coca-Cola Realme: ఫిబ్రవరి 10న తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు విడుదల.. ఫీచర్లు ఇవే..

ABN, First Publish Date - 2023-02-02T17:42:27+05:30

స్మార్ట్‌ఫోన్ (SmartPhone) కొనాలనుకునేవారు మార్కెట్‌లో విడుదలయ్యే కొత్త మొబైల్స్ కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ఔత్సాహికుల కోసం చైనా సెల్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Reaml) కీలక ప్రకటన చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ (SmartPhone) కొనాలనుకునేవారు మార్కెట్‌లో విడుదలయ్యే కొత్త మొబైల్స్ కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ఔత్సాహికుల కోసం చైనా సెల్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Reaml) కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 10న కోకా-కోలా (Coca-Cola) ఎడిషన్ రియల్‌మీ 10 ప్రో (Realme 10 pro) ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. కోకా-కోలా భాగస్వామ్యంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ 10 ప్రో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త కలర్స్‌లో, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో (UI) కీలక మార్పులు చేయనున్నట్టు వెల్లడించింది. ఇది 5జీ సపోర్ట్ ఫోన్ అని వివరించింది. కాగా బ్రాండ్ భాగస్వామ్యం కోసం ఇతర కంపెనీలతో జతకట్టడం రియల్‌మీకి ఇదే మొదటిసారి కాదు. గతేడాది మార్వెల్ (Marvel) భాగస్వామ్యంతో రియల్‌మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్‌ను (Realme GT Neo 3 Thor Edition) విడుదల చేసింది.

రియల్‌మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ ప్రో ఫీచర్లు ఒకటే. 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేటుతో 6.7 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌ డ్రాగన్ 685 5జీ, ఫుల్-హెచ్‌డీ రిసొల్యూషన్‌తో రానుంది. అయితే కోకా-కోలా బ్రాండ్ ప్రత్యేక ఎడిషన్ ఫోన్లు ఎక్కువ స్టోరేజీ 8జీబీ ర్యామ్, 128జీబీతో రానున్నాయి. ఇక 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, ఫ్రంట్ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో రానుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5జీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. అయితే ఈ ఫోన్ ధరపై స్పష్టత ఇవ్వలేదు. అయితే కోకా-కోలా ఎడిషన్ రియల్‌మీ 10 ప్రో ఫోన్‌ను యువత కోసం డిజైన్ చేయించామని చెప్పింది. దీనినిబట్టి ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.20 వేల వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. కాగా కోకా-కోలా భాగస్వామ్యంతో వస్తుండడంతో ఫోన్ల ధర మరింత తగ్గే అవకాశాలున్నాయి. కాగా రియల్‌మీ 10 ప్రో ప్లస్ ఫోన్లు డిసెంబర్‌లోనే మార్కెట్లో విడుదలయ్యాయి. 6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.27,999గా ఉన్నాయి.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ ఫీచర్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్‌వోసీ, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఫ్రంట్ అల్ట్రా-వైడ్ 8-మెగాపిక్సెల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్‌తో వచ్చింది.

Updated Date - 2023-02-02T17:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising