ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Twitter: ట్విటర్ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ABN, First Publish Date - 2023-08-31T16:36:28+05:30

ఎలాన్ మస్క్ నేతృ‌త్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.

ఎలాన్ మస్క్ నేతృ‌త్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విటర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది. అది కూడా ఫోన్ నంబర్ లేకుండానే కావడం విశేషం. ఈ విషయాన్ని కంపెనీ తమ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులో రానుందని పేర్కొంది. ట్విట్టర్ వినియోగదారులందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఈ సదుపాయం అందుబాటులో రానున్నట్లు తెలిపింది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “ఎక్స్ ద్వారా త్వరలో వీడియో & ఆడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఇది పని చేస్తుంది. ఇందుకు ఫోన్ నంబర్ అవసరం లేదు. ప్రభావంతమైన ప్రపంచ అడ్రస్ బుక్‌కు ఎక్స్ వేదికగా నిలవనుంది. ఇందులో అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి" అని ట్విటర్ తమ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ ట్వీట్ కూడా చేసింది.


నివేదికల ప్రకారం.. కొత్త ఫీచర్లు ట్విటర్‌లోని డైరెక్ట్ మెసేజ్ (DM) మెనులో అందుబాటులో ఉంటాయి. వీడియో కాలింగ్ ఎంపిక పైన కుడి మూలలో ఉంటుంది. కొత్త డీఎం మెనూ రూపకల్పన ఫేస్‌బుక్ మెసెంజర్ (Facebook Messenger), వాట్సాప్ (WhatsApp) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లను పోలి ఉంటుంది. ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్ తీసుకువచ్చే విషయంపై ట్విటర్‌ సీఈఓ లిండా యాకరినో కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొత్త ఫీచర్లు ట్విటర్‌లో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, వినియోగదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మరిన్ని మార్గాలను సుగుమం చేస్తాయని పేర్కొన్నారు.

ట్విటర్‌లో డిజైన్ ఇంజనీర్ అయిన ఆండ్రియా కాన్వే కూడా నూతన ఫీచర్ల గురించి కొద్ది రోజుల క్రితమే మాట్లాడారు. పైన కుడివైపున ఉండే డీఎం మెనూలో వచన సందేశాలు, ఫోటోలు, వీడియోలను పంపడానికి ఇప్పటికే ఉన్న ఎంపికల పక్కన వీడియో, ఆడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్‌లు రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇప్పటికే మెజెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంది. కానీ ట్విటర్ కూడా తమ వినియోగదారులకు ఆ సదుపాయం కల్పిస్తుండడంతో మెటాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ట్విటర్

Updated Date - 2023-08-31T17:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising