AC sleeper buses: ఏసీ స్లీపర్‌ బస్సులు

ABN , First Publish Date - 2023-03-27T03:28:20+05:30 IST

టీఎ్‌సఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెడుతోంది.

AC sleeper buses: ఏసీ స్లీపర్‌ బస్సులు

నేడు 16 సర్వీసులు ప్రారంభం

ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాలకు..

ఉచిత వైఫై, అధునాతన సౌకర్యాలు

హైదరాబాద్‌/సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది. సోమవారం నుంచి ఈ కొత్త బస్సులను ప్రారంభించనుంది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి; ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి; తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎ్‌సఆర్టీసీ నడపనుంది. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంది. మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా సైతం అందుబాటులో ఉంది.

అత్యాధునికమైన ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ అలారం సిస్టం (ఎఫ్‌డీఏఎస్‌) ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఇక ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు గాను ఆర్టీసీ ఇటీవలే 630 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను, నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ 8 బస్సులను, నాన్‌ ఏసీ స్లీపర్‌ 4 బస్సులను ప్రవేశపెట్టింది. నూతనంగా ప్రారంభించిన ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.

బస్సులను ప్రారంభించనున్న పువ్వాడ

కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులను సోమవారం ఉదయం ఎల్‌బీనగర్‌లోని విజయవాడ రహదారిపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-27T03:28:20+05:30 IST