ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ACB: ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. వివరాల్లోకెళ్తే...

ABN, First Publish Date - 2023-03-15T17:21:21+05:30

ఏసీబీ (ACB) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: ఏసీబీ (ACB) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2012లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ (GHMC) సెక్షన్‌ ఆఫీసర్‌ రాజశ్రీకి రెండేళ్లు జైలు శిక్ష విధించినట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఆమెకు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. అప్పట్లో ఈ ఘటన సంచలనానికి దారి తీసింది.

మరోవైపు.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల(Fake birth and death certificates) జారీకి సంబంధించి విజిలెన్స్‌ విచారణకు జీహెచ్‌ఎంసీ(GHMC)లోని కేంద్ర కార్యాలయ అధికారులు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వడంలేదు. సరైన పత్రాలు లేకుండా నగరంలోని 15 మీసేవా కేంద్రాల (Mseva Centers)నుంచి 25,743 నకిలీ జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్టు అధికారులు గుర్తించారు. నూతన సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ఆప్షన్‌ (Instant Approval Option)వల్లే అక్రమాలు జరిగినట్టు దాదాపుగా నిర్ధారణ అయింది. అయితే మొత్తం వ్యవహారంలో మీ సేవ కేంద్రాల పాత్ర ఎంత, జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు, ఉద్యోగులకు సంబంధముందా అన్నది తేల్చేందుకు అటు పోలీసులు, ఇటు విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈక్రమంలోనే కేంద్ర కార్యాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న సంబంధిత విభాగానికి విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు వచ్చారు. అయినా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదని విజిలెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

నకిలీ ధ్రువపత్రాల జారీ బాగోతం బయటపడిన నాటినుంచి జీహెచ్‌ఎంసీ(GHMC) వర్గాలు ఉన్నతాధికారి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ఆప్షన్‌ కల్పించినట్టు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను దృష్టిలో ఉంచుకొని అప్పటి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (Sanitary Inspector)పరిశీలన అనంతరం అదేరోజు సర్టిఫికెట్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. దీనిని సాకుగా చూపుతూ జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు తప్పు నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ఒకేరోజు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పరిశీలన పూర్తిచేసి సర్టిఫికెట్‌ ఇవ్వడం సాధ్యమా.. అన్న విషయాన్ని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం వర్గాలు పైఅధికారులకు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-03-15T17:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising