Karate Kalyani: కవిత తెలంగాణ మహిళల పరువు తీసింది
ABN, First Publish Date - 2023-03-11T20:35:35+05:30
బీఆర్ఎస్ (BRS)పై నటి కరాటే కళ్యాణీ (karate kalyani) ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) కామెంట్స్‌ను వక్రీకరించారని కరాటే కళ్యాణీ అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS)పై నటి కరాటే కళ్యాణీ (karate kalyani) ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) కామెంట్స్‌ను వక్రీకరించారని కరాటే కళ్యాణీ అన్నారు. తెలంగాణలో వాడుకభాషనే బండి సంజయ్ ఉపయోగించారని, లిక్కర్ స్కాం, బార్ లైసెన్స్ లకు కవిత (Kavitha) బ్రాండ్ అంబాసిడర్ అని ఆమె మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి నితీ నిజాయితీ లేదని కరాటే కల్యాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు బస్సు ప్రమాదం, ప్రీతి మృతిపై కేసీఆర్ (KCR) కుటుంబం ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కవిత తెలంగాణ మహిళల పరువు తీసిందని బీజేపీ నేత కరాటే కళ్యాణీ విమర్శించారు.
మరోవైపు దేశంలోని కరెంట్ లేని గ్రామాలకు మోదీ ప్రభుత్వం (Modi Government) విద్యుత్ ఇస్తోందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ (Telangana) మొదటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS)కు మహిళా వింగ్ ఉందో లేదో తెలియదన్నారు. బతుకమ్మ పేరుతో కవిత తెలంగాణ కల్చర్‌ను దెబ్బతీశారని మండిపడ్డారు. బతుకమ్మ దగ్గర డీజే, డిస్కో డ్యాన్సులు చేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. దొంగ సారా, చీప్ లిక్కర్ అమ్మితే.. అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తల వంచుకునే పరిస్థితిని కవిత తీసుకొచ్చారని విమర్శించారు. ‘‘తెలంగాణ తల వంచదు కాదు కవిత.. తల వంచుకునేలా చేశావు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-03-11T20:55:38+05:30 IST