ఎమ్మెల్యే చిన్నయ్య దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2023-04-01T22:46:37+05:30 IST

బెల్లంపల్లి మండలం లంబాడితండా రహ దారిపై శనివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు.

ఎమ్మెల్యే చిన్నయ్య దిష్టిబొమ్మ దహనం

బెల్లంపల్లిరూరల్‌, ఏప్రిల్‌ 1: బెల్లంపల్లి మండలం లంబాడితండా రహ దారిపై శనివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ మాట్లాడు తూ మహిళలను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చిన్న య్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఆరిజిన్‌ డెయి రీ బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి గోవర్ధన్‌, నాయకులు కేశవరెడ్డి, రాజులాల్‌యాదవ్‌, శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-01T22:46:37+05:30 IST