Kumaram Bheem Asifabad: మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ABN , First Publish Date - 2023-09-04T23:10:52+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 4: మత్స్య కారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం కుమరంభీం ప్రాజెక్టులో జిల్లా మత్స్య శాఖ అధికారి విజయ్‌కుమార్‌, ఎంపీపీ మల్లికార్జు న్‌తో కలిసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు.

Kumaram Bheem Asifabad: మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 4: మత్స్య కారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం కుమరంభీం ప్రాజెక్టులో జిల్లా మత్స్య శాఖ అధికారి విజయ్‌కుమార్‌, ఎంపీపీ మల్లికార్జు న్‌తో కలిసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలు గులు నింపారన్నారు. జిల్లా మత్స్యశాఖాధికారి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ 266చిన్న చెరు వులు, 14పెద్ద చెరువులతోపాటు అడ ప్రాజెక్టు కలిసి మొత్తం 4ప్రాజెక్టుల్లో 1.45కోట్ల చేపపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, ఎంపీటీసీ మల్లేష్‌, మత్స్యశాఖ అధ్యక్షుడు భానుప్రకాష్‌, వైస్‌ ఎంపీపీ మంగ, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలి..

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి నెట్‌బాల్‌ సీని యర్‌ మహిళా, పురుషుల ఎంపిక పోటీలను ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆదర్శ పాఠ శాలల అడ్మిషన్లకు పోటీ ఎక్కువగా ఉందన్నారు. ఉపా ధ్యాయులు కూడా దాన్ని కొనసాగించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లాకు మంచిపేరు తీసుకు రావాలన్నారు. జిల్లానెట్‌బాల్‌ అధ్యక్షుడు అలీబీన్‌ అహ్మద్‌, ప్రిన్సిపాల్‌ ఖలీల్‌ మాట్లాడుతూ పోటీల్లో 60మంది విద్యార్థులు పాల్గొనగా 24మందిని ఎంపికచేశామన్నారు. వీరుఈనెల9నుంచి 11వరకు నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయిపోటీల్లో పాల్గొంటా రన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌, జిల్లానెట్‌బాల్‌కార్యదర్శి తిరుపతి, హరీష్‌, ఏడుకొం డలు, అర్చన కుమారి, రాకేష్‌, సారంగపాణి, తాజ్‌, షాహీద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేయాలి

ఆసిఫాబాద్‌: జిల్లాకేంద్రంలో భవననిర్మాణ కార్మికసంఘం కోసం షెడ్డు, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆ సంఘం జిల్లాఅధ్యక్షుడు బాలకృష్ణ కోరారు. ఎమ్మె ల్యే ఆత్రంసక్కుకు సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయనవెంట అశోక్‌, ఆనందరావు,కమలాకర్‌,రాంచందర్‌,రవి, సాలయ్య, తిరుపతి, సత్యనారాయణ, నరేష్‌, సంతోష్‌ ఉన్నారు.

Updated Date - 2023-09-04T23:10:52+05:30 IST