Kumaram Bheem Asifabad: కార్యదర్శులు మరింత పట్టుదలతో పనిచేయాలి: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ABN , First Publish Date - 2023-08-31T23:09:42+05:30 IST

ఆసిఫాబాద్‌, ఆగస్టు 31: పంచా యతీ కార్యదర్శులు మరింత పట్టుద లతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో జిల్లాలో పనిచేస్తున్న 80మంది పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేస్తూ కలెక్టర్‌ హేమంత్‌ బొర్కడే, అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ఉత్తర్వులు అందజేశారు.

Kumaram Bheem Asifabad: కార్యదర్శులు మరింత పట్టుదలతో పనిచేయాలి: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 31: పంచా యతీ కార్యదర్శులు మరింత పట్టుద లతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో జిల్లాలో పనిచేస్తున్న 80మంది పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేస్తూ కలెక్టర్‌ హేమంత్‌ బొర్కడే, అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఇప్పటివరకు ఎంతో పని చేశారని దాంతో రాష్ట్రానికి దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అయితే ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్‌లో మరింత పట్టుదలతో పనిచే యాలన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో పడిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచా యతీ అధికారి సురేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

స్టడీ సర్కిల్‌ను ఉపయోగించుకోవాలి..

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఆదివాసీలకు ఉచిత కోచింగ్‌ అందించడానికి ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్‌ను ఉపయోగించుకుని గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం స్టడీసర్కిల్‌లో శిక్షణ పొంది ఎస్‌ఎస్సీ జీడీగా ఉద్యోగం పొందిన రెబ్బెన మండలం దుగ్గగూడకు చెందిన మడావి గంగును నిర్వాహకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఊశన్న, రాజశేఖర్‌, ఇందురావు, సర్పంచ్‌ రూపదేవ్‌, ఎం రూప్‌ దేవ్‌, నాగోరావు, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-31T23:09:42+05:30 IST