ఆసిఫాబాద్‌లో ఘనంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం

ABN , First Publish Date - 2023-03-02T23:07:34+05:30 IST

ఆసిఫాబాద్‌, మార్చి 2: ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా పట్టణంలోని అర్బన్‌ రెసిడెన్షి యల్‌ పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకై డిజిటల్‌ పాఠాల కోసం స్మార్ట్‌ టీవీని, నోట్‌ బుక్కులు పెన్నులను నాయకులు ప్రణయ్‌కుమార్‌ పంపిణీ చేశారు.

ఆసిఫాబాద్‌లో ఘనంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం

ఆసిఫాబాద్‌, మార్చి 2: ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా పట్టణంలోని అర్బన్‌ రెసిడెన్షి యల్‌ పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకై డిజిటల్‌ పాఠాల కోసం స్మార్ట్‌ టీవీని, నోట్‌ బుక్కులు పెన్నులను నాయకులు ప్రణయ్‌కుమార్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈవోఅశోక్‌, ఎంఈ వో మనుకుమార్‌, సత్యనారాయణమూర్తి, సత్తయ్య, ప్రణయ్‌, సోనాజీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మ దిన వేడుకలను గురువారం జిల్లాకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు నివాసంలో కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. యాపలపాటి ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీమల్లికార్జున్‌యాదవ్‌ తనయుడు శరత్‌యాదవ్‌ ప్లేట్లను పంపిణీచేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌, వెంకన్న, విలాస్‌, కార్తీక్‌, హైమద్‌, తాజ్‌, ఇమ్రాన్‌, రామాగౌడ్‌, గోపాల్‌ నాయక్‌, సాయికుమార్‌,స్వరూప, సంధ్య పాల్గొన్నారు.

రెబ్బెన(ఆసిఫాబాద్‌ రూరల్‌): మండలంలోని రెబ్బెన ఇందిరానగర్‌ గ్రామంలో కనకదుర్గ దేవి ఆల యంలో గురువారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం పులి హోర పంపిణీచేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో కేక్‌కట్‌చేసి స్వీట్లు పంపిణీచేశారు. కార్యక్ర మంలోఅర్చకుడు వినోద్‌, సర్పంచ్‌రాజ్యలక్ష్మి, తిరుపతి, మోడెం తిరుపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినంను గురువారం వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోచంద్రయ్య, అధ్యాప కులుకిరణ్‌,శ్రీధర్‌,దీపక్‌,షఫిక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

జైనూరు: ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదినం సంద ర్భంగా గురువారం మండలకేంద్రంలో రక్తదాన శిబి రం నిర్వహించారు. ప్రాథమికఆరోగ్యకేంద్రంలో మిత్రా వెల్ఫేర్‌ సొసైటీ, సన్‌రైజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 40మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ యాదవ్‌రావు, వైస్‌ ఎంపీపీ లక్ష్మణ్‌, డాక్టర్‌ అశోక్‌, నాయకులు అంబాజీ, పవన్‌కుమార్‌, శంకర్‌, సర్పంచ్‌లు భీంరావు, పార్వతీ బాయి, గోవింద్‌రావు, సార్జబాయి, శ్యాంరావు, కేశవ రావు, గుణాజీ తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండలంలో గురువారం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ మండలంలోని లింగిగూడ, కన్నెపల్లి, రాంబాయిగూడ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్నులు, పలకలను అందజేశారు. హనుమండ్ల జగదీష్‌, ఎమ్మెల్యే ఆత్రంసక్కు తన యుడు వినోద్‌, ఎంపీపీ శ్రీదేవి, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు కమల, శ్రీనివాస్‌, శంకర్‌గౌడ్‌, బాదిరావు, సర్పంచ్‌లు గోపాల్‌, మమత, శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ సరిత, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: మండల కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కెరమెరి: ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన వేడుక లను మండలంలో గురువారం ఘనంగా జరుపుకు న్నారు. ఆత్రంసక్కు యూత్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపదాబాయి, వైస్‌ఎంపీపీ అబ్దుల్‌ కలాం, ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:07:34+05:30 IST