ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala: ప్రాజెక్టులు, చెక్ డ్యాములకు బీజేపీ వ్యతిరేకం కాదు..

ABN, First Publish Date - 2023-07-31T16:12:09+05:30

నిర్మల్ జిల్లా: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

నిర్మల్ జిల్లా: సీఎం కేసీఆర్ (CM KCR) నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ప్రాజెక్టులకు, చెక్ డ్యాములకు వ్యతిరేకం కాదని, కడెం ప్రాజెక్టుకు మరిన్ని గేట్లు బిగించాలని నిపుణుల కమిటీ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం (Fasal Bima Yojana Scheme) ప్రవేశపెట్టినా.. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో అమలు కావడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. గోదావరి, ప్రాణహిత, మానేరులతోపాటు వరదలు వచ్చే వాగులకు కరకట్టలు నిర్మించాలన్నారు. గత మూడు నాలుగు వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద రూ. 25 వేల పరిహారం అందించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-31T16:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising