ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలి: ఎస్పీ సురేష్‌కుమార్
ABN , First Publish Date - 2023-06-21T22:30:14+05:30 IST
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 21: ప్రజలకు సమర్థవంతమైన సేవలందిం చాలని పోలీసులు అధికారులు, సిబ్బం దికి ఎస్పీ సురేష్‌కుమార్ సూచించారు. నెలవారీసమీక్షలో భాగంగా బుధ వారం జిల్లాకేంద్రంలోని పోలీసు హెడ్ కార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖ నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కృషిచేసిన అధికారులను అభినందించారు.

ఆసిఫాబాద్ రూరల్, జూన్ 21: ప్రజలకు సమర్థవంతమైన సేవలందిం చాలని పోలీసులు అధికారులు, సిబ్బం దికి ఎస్పీ సురేష్‌కుమార్ సూచించారు. నెలవారీసమీక్షలో భాగంగా బుధ వారం జిల్లాకేంద్రంలోని పోలీసు హెడ్ కార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖ నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కృషిచేసిన అధికారులను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో నమోదైన కేసులు, గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు వాటిపై చేసిన దర్యాప్తు స్థితిగ తుల గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వితావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరిం చారు. జిల్లాలో పోలింగ్‌కేంద్రాలు వాటిలో సమస్యాత్మక కేంద్రాలు తదితర వాటిపై ప్రణాళిక తయారు చేయాలని, పోలింగ్‌కేంద్రాలు, వాటిభౌగోళిక పరిస్థి తుల గురించి పోలింగ్‌కేంద్రాల వద్ద ఎంతమంది పోలీసు భద్రత అవసరమో తెలియజేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సీఐ సుధాకర్, డీసీఆర్‌బీ సీఐ పవన్‌కుమార్, డీపీఓ ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.