ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ABN , First Publish Date - 2023-04-21T22:38:27+05:30 IST

కెరమెరి, ఏప్రిల్‌ 21: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి ఆధునిక హంగులతో ఆంగ్లమాధ్యమంలో బోధన చేయను న్నట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కెరమెరి, ఏప్రిల్‌ 21: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి ఆధునిక హంగులతో ఆంగ్లమాధ్యమంలో బోధన చేయను న్నట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని దనో రలో మనఊరు మనబడి కార్యక్రమంలో నూత నంగా నిర్మించిన పాఠశాల భవనంను ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి జన ప్రాంతాల్లో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి అన్నిరకాల ఏర్పాట్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కార్య క్రమంలో డీఈవో అశోక్‌, ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుప తాబాయి, వైస్‌ఎంపీపీ కలాం, సర్పంచ్‌ చిలుక, ఎంఈవో సుధాకర్‌ ఉన్నారు.

లింగాపూర్‌: మండలంలోని ఘూంనూర్‌(కే)లో మనఊరు మనబడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌ హేమంత్‌ సహదేవ్‌రావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్య అథితులుగా హాజరై మాట్లాడారు. మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలాల్లో తాగునీరు, మరుగు దొడ్లు, తరగతి గదులు, కుర్చీలు, ప్రహరీ, తదితర వసతులు కల్పిస్తున్నామన్నారు. గ్రామ స్థులు, పోషకులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు మంచి భవిష్య త్తును అందించాలని అన్నా రు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దినందుకు ప్రధానోపా ధ్యాయురాలిని కలెక్టర్‌, ఎమ్మె ల్యేలు అభినందించారు. కార్య క్రమంలో మనఊరు మన బడి జిల్లా కోఆర్డినేటర్‌ ప్రశాంత్‌, ప్రధానోపాధ్యో యురాలు నాగమణి, సర్పంచ్‌ కనకజ్యోతీరాం తదితరులు పాల్గొన్నారు.

చలి వేంద్రం ప్రారంభం

కెరమెరి: మండలంలోని దనోర గ్రామంలో వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం ఏర్పాటు చేసిన అబ్దుల్‌ రహమాన్‌స్మారక చలివేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌ రిజ్వాన్‌ను వారు అభినందించారు.

సమస్యలు పరిష్కారించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: కెరమెరి మండలం తుమ్మగూడ రాంజీగూడ గ్రామంలోని జంగుబాయి ఆలయ సమస్యలు పరిష్కరించాలని ఆలయ కమిటీసభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు

Updated Date - 2023-04-21T22:38:27+05:30 IST