ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎన్నిక

ABN, First Publish Date - 2023-12-08T13:08:21+05:30

శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్: శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నియమించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకూ అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

ఇప్పటిదాకా ప్రొటెం స్పీకర్ ఎవరన్నదానిపై చర్చ జరిగింది. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఇంతలోనే బాత్రూంలో కాలు జారి గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కానీ వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తానికి రేవంత్ సర్కార్ అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గు చూపింది.

ప్రస్తుతం అసెంబ్లీలో ఏ పార్టీ వాళ్లు ఎంతమంది ఉన్నారంటే..

కాంగ్రెస్-64

బీఆర్ఎస్-39

బీజేపీ-8

ఎంఐఎం-7

ఇతరులు-1

Updated Date - 2023-12-08T13:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising