Amit sha: హైదరాబాద్‌కు అమిత్ షా.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ నేతలతో భేటీ?
ABN, First Publish Date - 2023-03-11T19:06:01+05:30
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amit shah)హైదరాబాద్ నగరానికి రానున్నారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amit shah)హైదరాబాద్ నగరానికి రానున్నారు. రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకుంటారు. రేపు ఉదయం 7.30 గంలకు సీఐఎస్ఎఫ్ (CISF) డే పరేడ్‌లో అమిత్ షా పాల్గొననున్నారు. రాత్రికి హకీంపేట్‌లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు.. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. శనివారం నాడు ఉదయం 11 గంటలకు ఈడీ (ED) ఎదుట హాజరైన కవిత ఇప్పటి వరకూ బయటికి రాలేదు. అయితే.. ఈడీ విచారణ ఇప్పటికే ఐదు గంటలు పూర్తయ్యింది. ఇవాళ రాత్రి 8 గంటల వరకూ విచారణ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా విచారించాల్సింది చాలానే ఉందని అందుకే రాత్రి వరకూ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది. సాయంత్రం 3.30 గంటలకు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణ గది నుంచి కాసేపు బయటికి వచ్చి మళ్లీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు వెళ్లారామె. ఇప్పటివరకూ కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మహిళా అధికారి సమక్షంలో ఈ విచారణ మొత్తం అధికారులు వీడియో షూట్ చేస్తున్నారు. నలుగురు సభ్యుల స్పెషల్ ఈడీ బృందం చేత కవిత విచారణ జరుగుతోంది.
Updated Date - 2023-03-11T19:10:24+05:30 IST