ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

ABN, First Publish Date - 2023-04-22T18:15:14+05:30

మంత్రి కేటీఆర్‌ (KTR)కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ (KTR)కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో (World Artificial Intelligence Show)కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు జూన్ 7, 8వ తేదీల్లో ఈ ప్రదర్శన జుమేరా ఎమిరేట్స్ టవర్, దుబాయ్‌ (Dubai)లో జరుగుతుంది. కేటీఆర్ సారధ్యంలో తెలంగాణ (Telangana) పురోగతిని, ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు. దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్యరంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ (Real Estate), రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శిస్తారు.

దుబాయ్‌కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతోపాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు. కేటీఆర్ హాజరు కావడం ద్వారా ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ రీజియన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేయనున్నారు.

Updated Date - 2023-04-22T18:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising