ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CEO Vikasraj: పోలింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాం

ABN, First Publish Date - 2023-11-26T20:38:11+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. ఆదివారం నాడు తన కార్యాలయంలో సీఈఓ వికాస్‌రాజ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. ఆదివారం నాడు తన కార్యాలయంలో సీఈఓ వికాస్‌రాజ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘EVM కమిషనింగ్ మొత్తం పూర్తి అయింది. EVMల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. EPIC కార్డ్‌ల పంపిణీ బీఎల్వోల ద్వారా జరుగుతుంది. 2290మొత్తం అభ్యర్థుల్లో 221 మహిళా అభ్యర్థులు ఉన్నారు. రంగారెడ్డి - 4, హైదరాబాద్ 14, ఒక్కో జిల్లాలో ఒక్కొకటి ఉంటుంది. 2.5లక్షల సిబ్బంది వరకు DIPLY అయింది. 45వేల మంది తెలంగాణ పోలీస్ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హోం గార్డ్స్ విధుల్లోకి వస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక సిబ్బంది ఉంటారు... 80వేల వీల్ చైర్ జిల్లాలకు పంపాము. 196 కేంద్ర బలగాలు వచ్చాయి...74 కంపెనీలు ఈరోజు వచ్చాయి. 24వేల హోం గార్డులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. 72, 48గంటల ముందు కఠినమైన నిబంధనలు ఉంటాయి. 48 గంటల నుంచే 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

48 గంటల ముందే స్థానికేతరులు బయటకు వెళ్లిపోవాలి. సైలెంట్ పీరియడ్‌లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదు. ఈ రోజు వరకు 709కోట్ల సొమ్ము సీజ్ చేశాం. 290కోట్ల వరకు నగదు ఉంది. MCCలో 1025 FIRలు నమోదయ్యాయి. 120 లింక్స్‌ను ఫిర్యాదులు వచ్చినందుకు డిలీట్ చేశాము. సువిధ యాప్ ద్వారా 41వేల అనుమతులు ఇచ్చాం. 7626 ఫిర్యాదులు C - విజిల్ ద్వారా వచ్చాయి. కాల్ సెంటర్‌కు 44282 జిల్లాలో, స్టేట్ లెవల్ 2500 కాల్స్ వచ్చాయి. కాల్ సెంటర్లలో 500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో CCTV, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్‌ను పకడ్బందీగా ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం’’ అని వికాస్ రాజ్ తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T21:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising