ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bellaiah Naik : 85 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది

ABN, First Publish Date - 2023-11-21T16:56:18+05:30

85 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ ( Bellaiah Naik ) తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయం. రెండు సార్లు అబద్ధాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని బెల్లయ్య నాయక్ అన్నారు.

హైదరాబాద్: 85 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ ( Bellaiah Naik ) తెలిపారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయం. రెండు సార్లు అబద్ధాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 9.98 లక్షల గిరిజనుల జనాభా.. 12 శాతం రిజర్వేషన్ అని కేసీఆర్ మోసం చేశారు. గోండు, కోయలను, గిరిజనులను, లంబాడీలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. వన్ సైడ్‌గా కేసీఆర్‌ను ఓడించబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 24 లక్ష పోడు పట్టాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ నువ్వెంత మందికి పోడు పట్టాలిచ్జావ్. తప్పుడు నివేదికలతో కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నాడు. ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడు. మళ్లీ సిగ్గులేకుండా నిరుద్యోగులతో కేటీఆర్ మీటింగ్ పెట్టాడు. అన్నివర్గాల ప్రజలకు కేసీఆర్ పాలనలో మోసమే జరిగింది. కేసీఆర్ ఓట్ల దొంగ. ఇరిగేషన్ ప్రాజెక్టుపై లక్ష కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది’’ అని బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T16:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising