కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka: ప్రాజెక్టులు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం

ABN, First Publish Date - 2023-11-21T17:58:49+05:30

ప్రాజెక్టులు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.

Bhatti Vikramarka:  ప్రాజెక్టులు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం

ఖమ్మం జిల్లా: ప్రాజెక్టులు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. మంగళవారం నాడు ముదిగొండ మండలం బాణాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ...‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా అని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఉంది కాబట్టే కరెంట్ ఉంది..2014 కంటే ముందు కాంగ్రెస్ అనేక ప్రాజెక్టులు డిజైన్ చేసింది.రాష్ట్ర విభజన అప్పుడు కూడా సోనియా గాంధీ నాలుగు శాతం ఎక్స్ట్రా పవర్‌ను కేటాయించారు. నువ్వు వచ్చిన తర్వాత మొదలు పెట్టింది ఒకటి యాదాద్రి, రెండు భద్రాద్రి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లేనివారికి ఇళ్లు, పని లేని వారికి పని కల్పించడం, పెన్షన్లు ఇవ్వడం, సమాజంలోని అసమానతలు తొలగించి అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యం.

ప్రపంచ దేశాలకూ ఆహార ధాన్యాలు ఎక్స్‌పోర్ట్ చేయడమే ఇందిరమ్మ రాజ్యం. బహుళార్ధక సాగర్ ప్రాజెక్టు‌లు కట్టి సంపద సృష్టించడమే ఇందిరమ్మ రాజ్యం..రాయి ఏంటో రత్నం ఏంటో ప్రజలకు తెలుసు. నిన్ను కూడా బండకేసి బాధడానికి సిద్ధమయ్యరు. గజ్వేల్ వదిలి కామారెడ్డి దాకా పోయావ్. 78 మందికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవ బోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అధిష్ఠానమే నిర్ణయిస్తుంది.మధిర ప్రజలను మీరు కొనలేరు..వాళ్లు కోరుకునేది దశ దిశ నిర్దేశించే నాయకుడు..ఎంతమంది వచ్చిన భట్టి విక్రమార్కను ఏం చేయలేరు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం అంతా తిరిగాను. కేసీఆర్ లాగా పామ్ హౌస్‌లో పడుకోలేదు. ప్రజలు పడుతున్న బాధలు చూశాను. రాష్ట్రం అంతా తిరిగి, వాటి పరిష్కారం కోసమే ఆరు గ్యారెంటీలు ప్రకటించాము’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T17:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising