TS Polls : అజారుద్దీన్‌కు బిగ్ రిలీఫ్.. నామినేషన్‌కు లైన్ క్లియర్
ABN, First Publish Date - 2023-11-06T18:20:09+05:30
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. HCA అధ్యక్షులుగా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు నిధులు దోచుకున్నారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్‌గిరి కోర్టుని ఆశ్రయించారు. దీనిపై సోమవారం నాడు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ముందుస్తు బెయిల్ ఇచ్చింది. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అజారుద్దీన్‌ను విచారించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అజారుద్దీన్ ఉన్నారు. వాస్తవానికి బెయిల్ రాకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి బెయిల్ వస్తుందా..? రాదా..? అని.. అటు అజారుద్దీన్ అభిమానులు, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. చివరికి బెయిల్ రావడంతో నామినేషన్ వేయడానికి అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ అయినట్లయ్యింది.
కేసు సంగతేంటి..?
టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదు అయింది. అజారుద్దీన్‌పై జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ 4 కేసులు పెట్టింది. 2020 నుంచి 2023 వరకు HCAలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసారని ఫారెన్సిక్ నివేదిక తెలిపింది. ఆగస్ట్ 10వ తేదీన HCA నిధులపై జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీ గొల్‌మాల్ చేసినట్లు గుర్తించింది. ఒక్కో బాల్‌ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలు పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం జరిగినట్లు లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్‌లో తెలింది. బకెట్ చైర్స్ కొనుగోలులో కూడా HCAకు 43 లక్షలు నష్టం వాటిల్లినట్లు కమిటీ రిపోర్టులో పేర్కొంది.ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు HCAకు నష్టం వచ్చింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం వాటిల్లింది. అజారుద్దీన్‌పై ఉప్పల్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్. అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉప్పల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ వేశారు.
TS Polls : కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన సయోధ్య.. డీల్ సెట్ చేసిన రేవంత్!!
TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్
Updated Date - 2023-11-06T18:22:01+05:30 IST