BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజీనామా యోచనలో బీజేపీ యువమోర్చా నేతలు
ABN, First Publish Date - 2023-11-05T12:39:35+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) కి భారీ తగిలింది. తమ పదవులకు రాజీనామా యోచనలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) కి భారీ తగిలింది. తమ పదవులకు రాజీనామా యోచనలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఏ క్షణంలో అయినా రాజీనామా నిర్ణయాన్ని తీసుకుంటామని యువమోర్చా స్పష్టం చేసింది. జనసేన పార్టీతో పొత్తుతో యువ నాయకత్వాన్ని చంపేస్తున్నారని యువమోర్చా నేతలు ఆరోపిస్తున్నారు.రాష్ట్ర నాయకత్వం తీరుపై బీజేవైఎం నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరాటాలు చేసిన తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు కేటాయించాలని బీజేవైఎం కోరింది. అయితే యువమోర్చాకు బీజేపీ నాయకత్వం ఒక్క టికెట్ కూడా కేటాయించాలేదు. దీంతో ఈ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా తమకు నచ్చలేదని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. తమ డిమాండ్‌ను కనీసం పట్టించుకోవడం లేదంటూ బీజేవైఎం నేతలు కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఇలా అయితే తమకు పదవులు ఎందుకు అని బీజేవైఎం కేడర్ బీజేపీ అధిష్ఠానంతో తెల్చిచెప్పింది. తెలంగాణలో బలంలేని జనసేన పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో తమకు సమాధానం చెప్పలని యువమోర్చా నేతలు బీజేపీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని నేతలు అన్నారు. రాష్ట్ర నాయకత్వం చివరి లిస్ట్‌లో అయినా కనీసం మూడు సీట్లు యువమోర్చాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని బీజేవైఎం రాష్ట్ర, జిల్లా కమిటీలు బీజేపీ అధిష్ఠానానికి తెల్చిచెప్పారు.
Updated Date - 2023-11-05T12:40:07+05:30 IST