ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి..!

ABN, First Publish Date - 2023-11-11T09:33:50+05:30

Telangana Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. .

నల్గొండ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల విషయంలో ఒకట్రెండు వివాదాలు జరిగినప్పటికీ ప్రశాంతంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే అంతకు ముందు కూడా పాల్వాయి స్రవంతి పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. తనకు అసలు ఆ అవసరమే లేదని తెలిపారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారు.

Updated Date - 2023-11-11T10:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising