ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP Candidate: హరీష్‌రావును ఢీ కొనడమే నా లక్ష్యం: శ్రీకాంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-11-11T16:02:44+05:30

మంత్రి హరీష్‌రావును ఢీకొనడంతో తన లక్ష్యమని సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా: మంత్రి హరీష్‌రావును (Minister Harish Rao) ఢీకొనడంతో తన లక్ష్యమని సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి (BJP Candidate Srikanth reddy) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావుపై పోరాటం చేయడం వల్లే తనపై 48 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గత 28 ఏళ్లుగా ఏబీవీపీలో పనిచేశానని.. విద్యార్థి సంఘంలో ఎన్నో సమస్యలపై పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. 2001లో సిద్దిపేటకు వచ్చిన చంద్రబాబుకు (Chandrababu) జై తెలంగాణ అని మొదట నినదించి నిరసన తెలిపింది తానే అని అన్నారు. సిద్దిపేటలో అవినీతి పాలన కొనసాగుతుందని విమర్శించారు. 38 ఏండ్లుగా దొరల పాలనలో బందించబడ్డ ద్రాశ్య సుంకలలు తెంచెందుకే పోరాటమన్నారు. హరీష్‌రావు బినామీ అని తనపై బురద చల్లడం సరికాదన్నారు. తన దగ్గర ఏమైనా దొర ఆస్తులు ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. వలస నేతలు వద్దు స్థానిక నేతలు ముద్దు అనే కరపత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎదిరించే వారిపై బైండోవర్ పేరిట కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. 20 రోజుల్లోనే హరీష్‌రావు భవిష్యత్ తేలనుందన్నారు. రంగాయక సాగర్ మిగులు భూమి ఎవరి పేరిట ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటి చెరువు బీఆర్ఎస్ నాయకులకు ఏటీఎంల మారిందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-11T16:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising