ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etela Rajender: బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లమే..

ABN, First Publish Date - 2023-11-21T11:27:46+05:30

Telangana Elections: గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

సిద్దిపేట: గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Gajwel BJP Candidate Etela Rajender) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లం. ప్రజలకు అండగా ఉంటాం.. కాలికి ముళ్ళు గుచ్చితే పన్నుతో తిస్త. ఎవరైతే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకలను పుట్టకొకలను చేశారో వాళ్ళే నా పై పోటీ చేసే దమ్ము లేక బీజేపోల్లను రానివ్వొద్దు అంటున్నారు. మీకు బాధ ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టండి. ప్రభుత్వ విలువ ప్రకారం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని నేను అన్నా నా మాట వినలేదు. భూ నిర్వాతులకు భూములను దూరం చేసి వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారు. దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నోల్లు ఎప్పటికీ బాగుపదరు. బీజేపీ ప్రభుత్వం (BJP Government) అధికారంలోకి రాగానే సంవత్సరానికి నాలుగు సిలిండర్‌లు ఉచితంగా అధిస్తాం. అదే విధంగా కళ్యాణ లక్ష్మీ లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతాం. రూ.2100 ఉన్న వడ్లకి రూ.3100లకు పెంచుతూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం’’ అని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-21T12:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising