JP.Nadda: అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందు దొందే
ABN, First Publish Date - 2023-11-27T17:45:01+05:30
దళిత బంధులో ముప్ఫై శాతం కమిషన్ తీసుకున్నారు. దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్. కేసీఆర్ అన్ని వర్గాల విరోధి. కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ర్టంలో అవినీతి. మోదీ హయాంలో దేశం అభివృద్ధిలో
నిజామాబాద్: అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు బొమ్మా బొరుసా లాంటివని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP.Nadda) విమర్శించారు. బోధన్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రజలనుద్దేశించి నడ్డా మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ ఉన్న చోట అవినీతి, అత్యాచారం. ఇక కాంగ్రెస్ ఉన్న చోటా అవినీతి. భూమి, సముద్రం, ఆకాశంలో అన్నింటా కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది. బీఆర్‌ఎస్ కాళేశ్వరం అవినీతి ఏటీఎంగా మారింది. ధరణి పోర్టల్ పేదల పాలిట అవినీతిగా మారింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అవినీతి పరుడు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ బంద్ చేస్తాం. మియాపూర్ భూమిని దోచుకోవాలని కేసీఆర్ పన్నాగం పన్నారు.’’ అని ఆరోపించారు.
‘‘దళిత బంధులో ముప్ఫై శాతం కమిషన్ తీసుకున్నారు. దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్. కేసీఆర్ అన్ని వర్గాల విరోధి. కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ర్టంలో అవినీతి. మోదీ హయాంలో దేశం అభివృద్ధిలో ఉంది. వచ్చే రెండేళ్లలో ప్రపంచం మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది. మొబైల్ రంగంలో చైనా నుంచి భారత్ అభివృద్ధి. అన్ని రంగాల్లో దేశం అభవృద్ధి జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ పథకం పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదు. తెలంగాణ పాలనలో ఉద్యోగులకు జీతాలు లేవు. అన్ని రంగాల్లో అవినీతి పెరిగింది. బీజేపీ వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు. బీజేపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేశారు. మోదీ ఉన్న చోట అభివృద్ధి. రోడ్లు, రైల్వే, అభివృద్ధి చేస్తాం.’’ అని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-11-27T17:45:02+05:30 IST