BRS : రైతుబంధు అనుమతి ఉపసంహరణపై సీఈఓను కలిసిన బీఆర్ఎస్..
ABN, First Publish Date - 2023-11-27T13:56:20+05:30
రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజాను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ.. రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలని.. దానిని ఎలా అపుతారని ప్రశ్నించారు. రైతుబంధు అనేది ఆన్ గోయింగ్ స్కీం అన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు.
హైదరాబాద్ : రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజాను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ.. రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలని.. దానిని ఎలా అపుతారని ప్రశ్నించారు. రైతుబంధు అనేది ఆన్ గోయింగ్ స్కీం అన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు.
రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదని కేశవరావు హితవు పలికారు. రైతుబంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని తాను అనడం లేదన్నారు. ఈసీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదని.. మేము రేపటి వరకూ విత్ డ్రా చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలని.. రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని కేశవరావు తెలిపారు.
Updated Date - 2023-11-27T13:56:22+05:30 IST