BRS - Congress: బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసిన కార్లు సీజ్
ABN, First Publish Date - 2023-11-05T12:31:24+05:30
బీఆర్ఎస్ ప్రభుత్వానికి (BRS GOVT ) వ్యతిరేకంగా తయారు చేసిన కార్లను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు ( Begambazar Police ) సీజ్ చేశారు.
హైదరాబాద్, అప్జల్‌గంజ్(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ప్రభుత్వానికి (BRS GOVT ) వ్యతిరేకంగా తయారు చేసిన కార్లను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు ( Begambazar Police ) సీజ్ చేశారు. నాంపల్లిలోని గాంధీ భవన్ కాంగ్రెస్ ( Congress ) పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పదేళ్లలో జరిగిన వైఫల్యాలు, నిరుద్యోగులను మోసం చేశారంటూ వివరాలతో కూడిన ప్రత్యేకంగా తయారు చేసిన మూడు అంబాసిడర్ కార్లను బేగంబజార్ పోలీసులు సీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కలర్ వేయించి అందరూ చూసే విధంగా గాంధీ భవన్ పార్కింగ్ యార్డ్‌లో ఉంచిన కార్లపై ఎన్నికల నిర్వహణ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు బేగంబజార్ పోలీసులకు కార్లను సీజ్ చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో బేగంబజార్ పోలీసులు మూడు కార్లను సీజ్ చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్లకు నెంబర్ ప్లేట్‌పై కేసీఆర్ 420 , నిరుద్యోగ భృతి ఆరు వేల కోట్ల బాకీ , బీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షల మంది రైతులను ముంచింది. ప్రభుత్వం కట్టించిన అడపాదడపా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, సంక్షేమ పథకాలల్లో కేసీఆర్ 30 శాతం కమిషన్, పదేళ్లు పూర్తవుతున్న ఇంటికో ఉద్యోగం ఎక్కడికి పాయే అంటూ రాతలు రాసి పబ్లిక్ సందర్శన కోసం గాంధీ భవన్ లో ఈ కార్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేసి క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియంకు తరలించారు.
Updated Date - 2023-11-05T12:31:26+05:30 IST