ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Polls: బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు ఫైల్

ABN, First Publish Date - 2023-11-29T14:45:11+05:30

Padi Kaushikreddy: హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజున నిన్న(మంగళవారం) కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

హుజూరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై (Huzurabad BRS Candidate Padi Kaushikreddy) పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజున నిన్న(మంగళవారం) కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఐపీసీ 171సీ,ఎఫ్, 188, 506, 123 ఆర్పీ యాక్ట్ కింద బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. ఎవరు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్‌స్పెక్టర్ సంజయ్ కోరారు.


మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ (EC) కూడా సీరియస్ అయ్యింది. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని చేసిన కామెంట్స్‌పై ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-11-29T14:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising