ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chidambaram: కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలియదు

ABN, First Publish Date - 2023-11-16T16:24:14+05:30

తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చిదంబరం కోరారు.

హైదరాబాద్: తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ అభివృద్ధి చేసి తీరుతాం. ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసి తీరుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధి చూసి అసంతృప్తి కలిగింది. గత పదేళ్లుగా ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయి. 2013 ధరలతో పోలిస్తే ఇప్పుడు ప్రతి నిత్యావసర వస్తువు ధర పెరిగింది. తెలంగాణలో అర్బన్, రూరల్ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యారంగానికి బడ్జెట్ పూర్తిగా తగ్గించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం. కేసీఆర్‌కి చరిత్ర సరిగా తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో కేసీఆర్ సరిగా చదవలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో నాకు అంతా గుర్తుంది. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన సిఫార్సులన్నీ పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేస్తాం. బడ్జెట్ దృష్టిలో పెట్టుకునే ఆరు గ్యారెంటీ స్కీములు ప్రకటించాం. కేసీఆర్ తనకి వచ్చే పార్లమెంట్ సీట్లతో కేంద్రంలో ఎలా చక్రం తిప్పగలడు’’ అని చిదంబరం ప్రశ్నించారు.

Updated Date - 2023-11-16T16:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising