Revanth Govt: ఆరు గ్యారంటీల అమలుపై స్పీడ్ పెంచిన రేవంత్ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-12-08T17:43:51+05:30
ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) స్పీడ్ పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీల అమలుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) స్పీడ్ పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీల అమలుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రేపు అసెంబ్లీ వాయిదా తర్వాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ( Arogyashree Scheme ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం విదితమే. అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
తొలిరోజే రేవంత్‌రెడ్డి సర్కార్ తన మార్కు పాలన చూపించారు. రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రెండోది రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగానే శనివారం సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2023-12-08T17:53:09+05:30 IST