కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanti: అరాచక పాలనపై తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైంది

ABN, First Publish Date - 2023-11-23T14:58:07+05:30

కేసీఆర్‌కు డబ్బే ముఖ్యం. లిక్కర్ స్కామ్‌లో ఇతరులను అరెస్టు చేశారు కానీ... కవితను అరెస్టు చేయలేదు.

Vijayashanti: అరాచక పాలనపై తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైంది

హనుమకొండ: అరాచక బీఆర్ఎస్ పాలనపై (BRS Government) తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘భూ, మైనింగ్ మాఫియాను కేసీఆర్ (Cm kcr) ప్రోత్సహించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం పేరుతో అవినీతికి పాల్పడ్డారు. టీఎస్‌పీఎస్ (TSPSC) పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... కేసీఆర్‌కు డబ్బే ముఖ్యం. లిక్కర్ స్కామ్‌లో ఇతరులను అరెస్టు చేశారు కానీ... కవితను అరెస్టు చేయలేదు. కేసీఆర్ కుటుంబం బరితెగించింది. అందరికీ చుక్కలు చూపించే నా వరంగల్ వాసులను కూడా కేసీఆర్ మోసం చేశారు. వరంగల్ వాసులు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి. కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించాలి.’’ అని విజయశాంతి పిలుపునిచ్చారు.

‘‘సంక్షేమం అంటేనే కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. బీజేపీ వాళ్లు సామదాన దండోపాయాలు ఉపయోగించి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవాలని చూస్తున్నారు. అవినీతి కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.’’ అని విజయశాంతి విమర్శించారు.

Updated Date - 2023-11-23T14:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising