CPI Narayana: కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
ABN, First Publish Date - 2023-11-26T17:28:03+05:30
కాంగ్రెస్ ( Congress ) నేతలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ ( BJP ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కుట్ర ఉందని సీపీఐ నేత నారాయణ ( Narayana ) వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం : కాంగ్రెస్ ( Congress ) నేతలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ ( BJP ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కుట్ర ఉందని సీపీఐ నేత నారాయణ ( Narayana ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టడం అవాస్తవం. నాటి నిరాహార దీక్ష బూటకం, అప్పుడు నేను సాక్షిని, తెలంగాణ ఉద్యమం నీరు కారొద్దని సహకారం అందించాను. నాడు నిష్పక్షపాతంగా కేసీఆర్‌కు సీపీఐ ఉద్యమ సహకారం అందిచాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నాటి ద్రోహులకు నేడు పెద్దపీట వేశారు. 1200 మంది విద్యార్థుల త్యాగఫలంతో నేటి తెలంగాణ సిద్ధించింది. 30 సీట్లు వొచ్చిన ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించటం వెనుక బీఆర్ఎస్‌లో ఉంది’’ అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం
‘‘ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం, బీజేపీకి డిపాజిట్లు రావు. బీసీ పార్టీ అధ్యక్షుడుని తొలగించి బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ చేస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. రైతుబంధు అనుమతి వెనుక బీజేపీ, బీఆర్ఎస్ , ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కు అయ్యారు. కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు , స్వతంత్ర అభ్యర్థి జలగం వెంకటరావు ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులే. ప్రజల్లో ఉండే నాయకుడు కూనంనేని సాంబశివరావుని ఈ ఎన్నికల్లో గెలిపించాలి’’ అని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-26T17:33:38+05:30 IST