ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Narayana: చంద్రబాబును కలిసేందుకు కేసీఆర్, కేటీఆర్ యత్నించారని నారాయణ సంచలనం

ABN, First Publish Date - 2023-11-28T12:46:53+05:30

Assembly Elections : టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు ఒప్పు కోలేదని.. కేసీఅర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామన్నారు. ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నానని సీపీఐ నారాయణ తెలిపారు.

ఖమ్మం : టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలవాలని సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR) యత్నిస్తున్నారని సీపీఐ నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు ఒప్పు కోలేదని.. కేసీఅర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామన్నారు. ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నానని సీపీఐ నారాయణ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సన్‌ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ అంటూ కామెంట్స్ చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Congress Candidate Tummala Nageshwar Rao) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారాయణ పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ స్కాం వల్ల బీజేపీకి (BJP) కేసీఆర్ తలొగ్గారన్నారు. కేసీఆర్ తుమ్మ ముళ్ళు వ్యాఖ్యలు చేశారు కానీ తుమ్మల తులసి మొక్క లాంటోరని అన్నారు. ఖమ్మంలో పోటీ తులసి మొక్కకు గంజాయి మొక్క మధ్య అంటూ వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్ (Puvvada Ajay) గంజాయి మొక్క లాంటోడని.. పువ్వాడకు సీపీఐ పార్టీ ఓట్లు వేయదని అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. తుమ్మల నలభై ఏళ్లుగా పరిచయమన్నారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంకు చెంపపెట్టు అని సీపీఐ నేత అన్నారు.

కాళేశ్వరం (Kaleshwaram Project) మునిగిందని కల్వకుంట్ల కుటుంబం ఖజానా నిండిందని విమర్శించారు. దళిత బంధుపై (Dalit Bhandu) రాజకీయం తప్ప రైతులపై ప్రేమ కాదన్నారు. యువత, మహిళలు, రైతులు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అహంభావంలో నెంబర్ వన్ కేసీఆర్.. నెంబర్ టూ కేటీఆర్‌ (Minister KTR).. నెంబర్ త్రీ పువ్వాడ అజయ్ అని అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష నిజమైంది కాదని... చావు లేకుండా మందులు ఇచ్చారని అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కే కేసీఆర్ పాలన తరమికొట్టాలని అన్నారు. కేసీఆర్ ఓడిపోతారు ఇక ఫార్మ్ హోస్‌కే పరిమితమన్నారు. కేసీఆర్‌ను పదేళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మోదీ (PM Modi), కేసీఆర్, జగన్ (AP CM Jagan) ముగ్గురూ దొంగలే అని విమర్శించారు. కోదండ రామ్‌ను పక్కన పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) కూలిపోతుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా ఉన్నామన్నారు. ఒక్క సీటా రెండు సీట్లా కాదు బీజేపీ, బీఆర్‌ఎస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-28T12:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising