ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao: బీజేపీతోనే బీసీ సీఎం సాధ్యం

ABN, First Publish Date - 2023-11-28T15:09:24+05:30

సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం దుబ్బాకకు వచ్చి నన్ను తిట్టారు. కట్టిన ఇళ్లు పాడైపోతున్నాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిచ్చినందుకా?, దుబ్బాక మీద కేసీఆర్‌కు (Cm kcr) ప్రేమ ఉంటే

సిద్దిపేట: బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని.. అదే బీఆర్ఎస్‌ని గెలిపిస్తే కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) అన్నారు. దుబ్బాక పట్టణంలో రఘునందన్ రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం దుబ్బాకకు వచ్చి నన్ను తిట్టారు. కట్టిన ఇళ్లు పాడైపోతున్నాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిచ్చినందుకా?, దుబ్బాక మీద కేసీఆర్‌కు (Cm kcr) ప్రేమ ఉంటే వెంకటేశ్వర గుడి, కేసీఆర్ బడి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఓపెన్‌కు ఎందుకు రాలేదు. దుబ్బాకకు లైబ్రరీ ఇస్తానని ఇవ్వలేదు కానీ.. రెండు వైన్స్ దుకాణాలు ఇచ్చారు. యువతను చెడగొట్టడాని పబ్బు కావాలని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు. దుబ్బాక చేనేతకు రూ.25 లక్షలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. రఘునందన్‌వి జూటా మాటలని కేటీఆర్ (KTR) అంటున్నారు. కానీ కేసీఆర్‌ను మించిన జూటా మాటలు ఎవరికి రావు. అసెంబ్లీలో కేసీఆర్‌ను నిలదీస్తే.. సమస్యలపై ప్రశ్నిస్తే భయమై నన్ను తిడుతున్నారు. దుబ్బాకకు ఏం కావాలో రఘునందన్ రావు చూస్తాడు.. సిద్దిపేటోడు అవసరమా?, రఘునందన్ కొట్లాట పేద ప్రజల కొట్లాట. దుబ్బాక నిధులన్ని సిద్దిపేటకు హరీష్ రావు ఎత్తుకపోయారు.’’ అని విమర్శించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T15:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising