Raghunandan Rao: అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపమేల.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం
ABN, First Publish Date - 2023-11-27T11:28:01+05:30
Telangana Elections: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు.
సిద్దిపేట: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. 2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఊరుకో సామెత, నాటకం ఆడేందుకు ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలని విరుచుకుపడ్డారు. కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసం అని వ్యాఖ్యలు చేశారు. తమరు చెప్పిన అబద్ధాలు చెప్పాలంటే 5సంవత్సరాలు పడుతుందన్నారు.
‘‘అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపం ఎందుకు. దుబ్బాక అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం తప్పా. మీరు చేసిన అరాచకాలకు మీ మీద విరక్తి వచ్చి దుబ్బాకలో ఎమ్మెల్యే అయిండు రఘునందన్ రావు. నిన్నటి సభలో స్వర్గీయ రామలింగారెడ్డి పేరు తీయడానికి ముఖ్యమంత్రికి మనుసు రాలే. దుబ్బాక ప్రజల మీద ఈగ వాలినా రఘునందన్ ఊరుకోడు. దుబ్బాక దళితులకు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. రామలింగారెడ్డితో గొడ్డు చాకిరి చేయించుకున్నోడు హరీష్. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కోడితే నేను ఊకోను. దుబ్బాక ప్రజల గుండెల్లో నిలిచిన రఘునందన్‌ను తిడితే ప్రజలే బుద్ధి చెబుతారని. 2009 లో 171 ఓట్లతో గెలిచినోడు 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు. రింగ్ రోడ్డుకు నెలకే సర్వే చేపిస్తామనడం బాధాకరం. రింగ్ రోడ్డు సర్వే పూర్తై యాడది అయింది. రామలింగారెడ్డి ఉన్నప్పుడు దుబ్బాక ప్రజలు సమ్మె చేసినప్పుడు ఎందుకు డివిజన్ ఇవ్వలే. ప్రశ్నించే గొంతు రఘునందన్ రావు గొంతు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టెకు లెంకినప్పుడు నేను పక్కనే ఉన్న. నన్ను తట్టుకోలేక నామీద బూతులు తిడుతుండ్రు. దుబ్బాక మీద నీకు ప్రేమ ఉంటే మెదక్ కంటే ముందు దుబ్బాకకు రింగ్ రోడ్డు ఎందుకు ప్రకటించలేదు. నన్ను తిడితే బాధపడలేదు.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం. కత్తి పోట్లు మేము కూడా చేయవచ్చు అనడం ముఖ్యమంత్రికే చెల్లింది. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని చెప్పింది అబద్ధమా. దళితుల భూమి గుంజుకొని కలెక్టరేట్ కట్టలేదా. దుబ్బాక నీది అయితే బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కేటీఆర్ బడి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓపెనింగ్‌కు ఎందుకు రాలేదు? దుబ్బాకకు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాల ఎత్తుకెళ్లింది హరీష్ రావు. దుబ్బాక వెనుకబడటానికి మొట్టమొదటి కారణం హరీష్ రావు. చింతమడక గ్రామానికి నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు.. కేసీఆర్ ఇచ్చిన పైసలు లెక్క తీద్దాం’’ అని రఘునందన్‌రావు సవాల్ విసిరారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-27T12:10:46+05:30 IST