ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti Srinivas: బీఆర్‌ఎస్ సహకారంతో నాపై కేంద్ర సంస్థల దాడులు జరగబోతున్నాయ్..

ABN, First Publish Date - 2023-11-08T10:25:24+05:30

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెను తుఫాన్‌లా విజృంభిస్తోందని మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావటం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పెను తుఫాన్‌లా విజృంభిస్తోందని మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Former Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావటం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్‌కంట్యాక్స్, ఈడీ దాడులు జరగబోతున్నాయని.. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీలు (BJP) కాంగ్రెస్ పార్టీపై కక్ష కట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేదానికి దాడులే నిదర్శనమన్నారు. ‘‘కాంగ్రెస్‌లో చేరిన తరువాత బీఆర్ఎస్ సహకారంతో కేంద్ర సంస్థలు... నా మీద, నా కుటుంబం మీద, నా సంస్థలపై, నన్ను అభిమానించే వ్యక్తులు మీద దాడులు జరగబోతున్నాయి. సంస్థలు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి... నన్ను ఇబ్బందులు పెడుతారు అని తెలుసు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు విశ్వసనీయత ఉంది కాంగ్రెస్ పార్టీ మీదనే. రాబోయే కొద్ది రోజులలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తొందరపడి నిర్ణయాలు తీసుకొవద్దు’’ అని చెప్పుకొచ్చారు.


మీ దయా దాక్షిణ్యాల మీద ఎంపీ కాలేదు...

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అద్భుతం అని కేసీఆర్ అనేక సభలలో గఫాలు పలికారని.. కాళేశ్వరం నిజ స్వరూపంపై కేంద్రం నివేదికలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది అనేది అర్ధం అవుతుందన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సూదిమళ్లు ఎదో ఒక రోజు కూలిపోతాయన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇంటరాగేషన్ ఎందుకు చేయలేదని అడిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు మాయం చేసే అవకాశం ఉందని... చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా లక్షల కోట్ల రూపాయలతో అధికారంలోకి మూడవ సారి రావాలని చూస్తున్నారన్నారు. దొరల పాలన వద్దని... ప్రజల పాలన కావాలన్నారు. దోపిడీ పాలన వద్దని.. ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. పడ్డ కష్టాలు పడ్డారని... 25 రోజుల తరువాత కష్టానికి ఫలితం రాబోతుందని అన్నారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు మదంతో వీర్రవీగటం లేదని... 2008లో కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు. ‘‘మీ దయా దాక్షిణ్యాల మీద ఎంపీ కాలేదు... మంత్రిగా లేను. ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు మీకే చూపిస్తాయి. కొంత మంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ పార్టీకి చెంచాలుగా నడుచుకుంటున్నారో దానికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. మీ పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలి’’ అని హితవుపలికారు. ప్రియాంక గాంధీ (Priyanaka Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రోగ్రామ్ ఈ నెల 15 తరువాత ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-11-08T11:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising