ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaggareddy: అధికారులు విధి నిర్వహణలో ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దు

ABN, First Publish Date - 2023-12-09T19:25:59+05:30

విధి నిర్వహణలో అధికారులు ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు.

సంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో అధికారులు ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నాం. ఈ రోజు ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షలు కూడా అమల్లోకి వచ్చింది. సంగారెడ్డి నియోజకవర్గ అధికారులు నా సూచనలు ఫాలో అవ్వాలి. ఇక నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమాలకు నా భార్య నిర్మల జగ్గారెడ్డిని పిలవాలి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నా సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయినా ఎమ్మెల్యేనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారు. కానీ నేను హుందాగా వ్యవహారించాను.. ఏమి అనలేదు అప్పుడు.. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వాళ్ల నేను ఓడిపోయినా.. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నా తరుపున ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల హాజరవుతారు. అధికారులు అందరు నిర్మలకి సమాచారం ఇవ్వాలి. ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సంగారెడ్డి నియోజకవర్గ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిగా చెబుతున్నాను’’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-09T19:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising