KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
ABN, First Publish Date - 2023-12-04T21:25:40+05:30
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ప్రజల తీర్పును గౌరవిద్దాం. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ప్రజల తీర్పును గౌరవిద్దాం. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది. కానీ.. ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం త్వరాత ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తాం. త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందాం’’ అని కేసీఆర్ తెలిపారు.
Updated Date - 2023-12-04T21:26:06+05:30 IST