KCR: ఫౌంహౌస్‌లోనే కేసీఆర్.. మొన్న ఎమ్మెల్యేలు, నేడు చింతమడక గ్రామస్తులు...!?
ABN, First Publish Date - 2023-12-06T15:34:13+05:30
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గత నాలుగు రోజులుగా ఉంటున్నారు.
సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గత నాలుగు రోజులుగా ఉంటున్నారు. నేడు (బుధవారం) కేసీఆర్‌ని కలవడానికి సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామస్తులు ఫౌంహౌస్‌కి చేరుకున్నారు. 9 బస్సులల్లో సుమారు 540 మంది గ్రామస్తులు ఫాంహౌస్ దగ్గరికి వచ్చారు. ఫాంహౌస్ పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద గ్రామస్తులను పోలీస్ సిబ్బంది నిలిపివేశారు. పర్మిషన్ ఉంటేనే ఫాంహౌస్ లోపలికి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.
కాగా.. ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ని కలిసి పార్టీ భవిష్యత్తు పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. నేడు (బుధవారం) కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామస్తులు కేసీఆర్‌ని కలిసేందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం, గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేశారు. అయితే ఇక్కడ అనూహ్యంగా కేసీఆర్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి విజయ రమణారెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఫౌంహౌస్‌లో కేసీఆర్ రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఎమ్మెల్యేలపై ఎందుకంత వ్యతిరేకత వచ్చిందనే దానిపై కూడా కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు, 6 గ్యారెంటీ హామీల అమలు ఎలా చేస్తారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే ఎలా పోరాడాలి అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-12-06T15:52:53+05:30 IST